పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నాయకుల పిలుపు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నాయకుల పిలుపు
అర్హులైన పట్టభద్రులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి
తల్లాడ, అక్టోబర్ 23 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని గొడుగునూరి లక్ష్మారెడ్డి, దుండేటి వీరారెడ్డి పిలుపునిచ్చారు.
శుక్రవారం తల్లాడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని ప్రారంభించి, దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించారు. 2023కు ముందు డిగ్రీ పట్టా పొందిన అర్హులైన పట్టభద్రులు గడువులోగా దరఖాస్తు చేసుకుని ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మర్సకట్ల బాబురావు, తాళ్ల జోసెఫ్, వెంకటనారాయణరెడ్డి, బొడ్డు వెంకటేశ్వరరావు, నున్న శ్రీనివాసరావు, గొడుగునూరి శ్రీనివాసరెడ్డి, నరసింహారావు, కొత్తపల్లి విజయ్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి: అఖిలపక్ష నాయకుల డిమాండ్












