04/11/2026, Wednesday · 06:45:29 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

అమరవీరుల రక్తతర్పణం వృథా కానివ్వం.. సమ సమాజ స్థాపన కోసం పోరాడుతాం!_ మాస్ లైన్ కార్యదర్శి పుల్లయ్య

Yakub Pasha 01/11/2026 3:22 PM ఖమ్మం

అమరవీరుల రక్తతర్పణం వృథా కానివ్వం.. సమ సమాజ స్థాపన కోసం పోరాడుతాం!_ మాస్ లైన్ కార్యదర్శి పుల్లయ్య
Want this news as a newspaper clip?Print News Clip

సమ సమాజ స్థాపనే అమరవీరులకు అర్పించే నిజమైన నివాళి

దోపిడీ లేని సమాజం కోసం పోరాడాలి: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి సీహెచ్ పుల్లయ్య

ఖమ్మం, నవంబర్ 1 ( పీపుల్స్ వాయిస్):

దోపిడీ లేని సమాన హక్కులు కలిగిన సమ సమాజ స్థాపనే అమరవీరులకు అర్పించే నిజమైన నివాళి అని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి సీహెచ్ పుల్లయ్య పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మంలోని రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల సంతాప సభ నిర్వహించారు.

సభకు ముందు అమరవీరుల స్థూపం వద్ద అరుణ పతాకాన్ని ఎగురవేసి, పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సీహెచ్ పుల్లయ్య మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు ఉద్యమ వందేళ్ల ప్రస్థానంలో దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం, పేదల విముక్తి కోసం, భూమి, భుక్తి, విముక్తి కోసం ఎందరో పోరాడి అమరులయ్యారని గుర్తుచేశారు. ప్రజల విముక్తే లక్ష్యంగా భావించి పోరాడిన వారు ఎన్‌కౌంటర్లు, హత్యలకు బలయ్యారని పేర్కొన్నారు.

స్వాతంత్ర్య పోరాటంలో భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, తెలంగాణ సాయుధ పోరాటంలో 4 వేల మంది కమ్యూనిస్టు యోధులు, ప్రజలు సహా అనేక వీరోచిత పోరాటాల్లో వేలాది మంది అమరులయ్యారని తెలిపారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ విప్లవ జోహార్లు అర్పించాలని కోరారు. అమరవీరుల ఉన్నత లక్ష్యం సోషలిస్టు సమాజ స్థాపన, నూతన ప్రజాస్వామిక విప్లవమని, వారి ఆశయాలను నిరంతరం గుర్తుంచుకోవాలని అన్నారు.

మరోవైపు పాలకవర్గాలు పేదల పేరుతో అధికారంలోకి వచ్చి ధనిక వర్గాలకు కొమ్ముకాస్తున్నాయని, దేశ సంపదను, ప్రజా వనరులను దేశీయ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని చమురు, ఖనిజాలు, విమానాశ్రయాలు, రైల్వేలు, ఇస్రో, ఎల్‌ఐసీ, బ్యాంకులు సహా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని ఆరోపించారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో 13 కోట్ల 40 లక్షల మంది ఓట్లను తొలగించారని, ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగించే చర్యలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఓటు చోరీ, నోట్ చోరీ, ఫలితాల చోరీ ద్వారా తమ పాలనను శాశ్వతం చేసుకోవాలని పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో అమరవీరులు నడిచిన మార్గంలో కార్యకర్తలు పయనించాలని పిలుపునిచ్చారు. గోదావరి లోయ పోరాటంలో అమరులైన బత్తుల వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, వెంకన్న, రామనర్సయ్య, నీలం రామచంద్రయ్య, రాయల సుభాష్ చంద్రబోస్, డీవీ కృష్ణ, దొరన్న, ధర్మన్న, బాటన్న, జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కుమార్ నారాయణ, జానకిరామ్ రెడ్డి, కాచినపల్లి అమరవీరులు, ముస్మి అమరవీరులు, మాధవన్న, విక్రమ్, లింగన్న, ఎల్లన్న, పంచాది నిర్మల, సుశేన, చింతా లక్ష్మి, సీతక్క, రాయల చంద్రశేఖర్ తదితరులు దోపిడీ లేని సమాజ స్థాపన కోసం పోరాడారని గుర్తుచేశారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ శిరోమణి, టీయూసీఐ ఖమ్మం ఏరియా కార్యదర్శి కే. శ్రీనివాస్, ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, పార్టీ జిల్లా నాయకులు నామాల ఆజాద్, లెనిన్ బొల్లి, కొమరయ్య, ధరణి కృష్ణ, చిలకల నరసింహారావు, రామనాథం, రమేష్, రవి, పీడీఎస్‌యూ జిల్లా ఇన్‌చార్జి కార్యదర్శి రఘు, తోళ్ల మురళి, వెంకటేష్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Secretary PullaiahLetwastebloodmartyrsfightestablishmentcommon

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్