04/11/2026, Wednesday · 06:43:31 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

వెలుగుమట్ల బాధితులకు అక్కడే ఇళ్ల స్థలాలు కేటాయించాలి_గుమ్మడి నరసయ్య

Yakub Pasha 27/10/2026 8:26 PM ఖమ్మం

వెలుగుమట్ల బాధితులకు అక్కడే ఇళ్ల స్థలాలు కేటాయించాలి_గుమ్మడి నరసయ్య
Want this news as a newspaper clip?Print News Clip
  • వెలుగుమట్ల భూదాన భూముల బాధితులకు అదే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్.
  • ప్రభుత్వం స్పందించకపోతే బాధితుల తరఫున భూమిని ఆక్రమించి ఇళ్ల స్థలాలు పంచుతామని గుమ్మడి నరసయ్య హెచ్చరిక.

వెలుగుమట్ల బాధితులకు అక్కడే ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలి: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

ఖమ్మం, అక్టోబర్ 27 (పీపుల్స్ వాయిస్):
వెలుగుమట్ల భూదాన భూముల్లో ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులందరికీ, పంచనామా జాబితాలో పేర్లు ఉన్నవారితో పాటు అందులో పేర్లు లేని నిజమైన బాధితులకు సైతం అదే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బాధితుల తరఫున ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి వివిధ పత్రాలు సమర్పించిన అనంతరం ఆయన ఈ అంశంపై మాట్లాడారు. పేదల ఇళ్లు కూల్చివేసి ఏడు నెలలు పూర్తయి, ఎనిమిదో నెల కొనసాగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని, ప్రస్తుతం అద్దె ఇళ్లలో ఉంటూ అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోందని తెలిపారు.

ప్రభుత్వం ఇప్పటికే సమస్య పరిష్కారంలో జాప్యం చేసిందని, ఇకనైనా కాలయాపన చేయకుండా బాధితులందరికీ న్యాయం చేయాలని గుమ్మడి నరసయ్య కోరారు. ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించకపోతే బాధితుల తరఫున భూమిని ఆక్రమించి ప్రజలకు ఇళ్ల స్థలాలు పంచుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆవుల అశోక్, నాయకులు వరగాని కోటేశ్వరరావు, కవిత, వెంకటేశ్వరరావుతో పాటు వెలుగుమట్ల బాధితులు కళ్యాణి, సతీష్, సుమలత, పద్మ, గంగమ్మ, లక్ష్మీ, జయమ్మ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Light victimsallottedhousesGummadiNarasayya

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్