04/11/2026, Wednesday · 06:36:27 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

పీడీఎస్‌యూలోకి పలువురి చేరికలు

Yakub Pasha 27/10/2026 7:30 PM ఖమ్మం

పీడీఎస్‌యూలోకి పలువురి చేరికలు
Want this news as a newspaper clip?Print News Clip
  • వెంకటేష్ వంగూరితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పీడీఎస్‌యూలో చేరిక.
  • పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్.

పీడీఎస్‌యూలోకి పలువురి చేరికలు

వెంకటేష్ వంగూరితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పీడీఎస్‌యూలో చేరిక

ఖమ్మం, అక్టోబర్ 27 (పీపుల్స్ వాయిస్):
 ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లెనిన్ నగర్‌లోని న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యాలయంలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల మాస్ లైన్ పీడీఎస్‌యూకు రాజీనామా చేసిన వెంకటేష్ వంగూరితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు తిరిగి మాతృసంస్థ పీడీఎస్‌యూలో చేరారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పి. మహేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థి ఉద్యమంలో ఏర్పడిన చీలికలను అధిగమించి విప్లవ విద్యార్థి సంఘాలు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. భావసారూప్యత కలిగిన సంఘాలను ఏకం చేసి బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం–2020 వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో లేకుండా పోతోందని వారు విమర్శించారు. విద్యార్థుల హక్కులు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో విద్యారంగ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని పేర్కొంటూ, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని, ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ విద్యారంగానికి తగిన నిధులు కేటాయించాలని కోరారు.

ఖమ్మం జిల్లాలో బలమైన విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి ఈ చేరికలు దోహదపడతాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యా హక్కులు, సామాజిక న్యాయం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Multiple additionsPDSU

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్