04/11/2026, Wednesday · 06:39:32 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఖమ్మంలో బీసీ రాజ్యాధికార పాదయాత్రపై పార్టీ సమావేశం

Yakub Pasha 26/10/2026 6:25 PM ఖమ్మం

ఖమ్మంలో బీసీ రాజ్యాధికార పాదయాత్రపై పార్టీ సమావేశం
Want this news as a newspaper clip?Print News Clip

ఖమ్మంలో బీసీ రాజ్యాధికార పాదయాత్రపై పార్టీ సమావేశం

ఖమ్మం టౌన్, అక్టోబర్ 26 (పీపుల్స్ వాయిస్):

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు సోమవారం ఖమ్మం జిల్లా కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. వచ్చే నెలలో ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న బీసీ రాజ్యాధికార పాదయాత్రకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ ఇన్‌చార్జి గట్ల రాజన్న, సోషల్ మీడియా కన్వీనర్ ముక్కంటి సాయి చరణ్, జిల్లా అధ్యక్షుడు దామళ్ల సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు పెరుమాళ్లపల్లి నాగార్జున, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పాదయాత్ర నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, పార్టీ శ్రేణుల సమన్వయంపై చర్చించారు.

బీసీల రాజకీయ, సామాజిక హక్కులు, రాజ్యాధికారంలో వారి భాగస్వామ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే పాదయాత్ర లక్ష్యమని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశంలో జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తిరుమలగిరి జితేందర్, ఖమ్మం టౌన్ అధ్యక్షుడు కొప్పుల రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలోజు వినయ్ కుమార్, జిల్లా యువజన అధ్యక్షుడు తెళ్ళపుట్ట జగపతి, పెద్దప్రోలు కోటేశ్వరరావు, చట్టూ గోపి, పెనుగొండ ఉప్పలయ్య, రాయల సుధీర్, అదురి అజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Party meetingRajapaksapadayatraKhammam

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్