మురసు తుఫాన్‌తో నీట మునిగిన వరి పొలాలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి!

మురసు తుఫాన్‌తో నీట మునిగిన వరి పొలాలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి!
పంట నష్టంపై రైతులతో ఆరా.. అండగా ఉంటామని భరోసా
సత్తుపల్లి, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):
మురసు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ క్షేత్రస్థాయిలో పర్యటించి నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు.ఈ సందర్భంగా పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని, పంటలకు జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి తుఫాన్ కారణంగా ఎదురైన ఇబ్బందులు, పంట నష్టానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, పంట నష్టాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నష్టాన్ని అంచనా వేసేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, వేంసూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు, సత్తుపల్లి, వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని












