29/11/2026, Sunday · 09:17:45 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

డీజే సౌండ్ తగ్గించమన్నందుకు తెలంగాణ ఉద్యమకారుడిపై దాడి!

Yakub Pasha 22/10/2026 9:14 PM ఖమ్మం

డీజే సౌండ్ తగ్గించమన్నందుకు తెలంగాణ ఉద్యమకారుడిపై దాడి!
Want this news as a newspaper clip?Print News Clip
  • డీజే సౌండ్ తగ్గించమన్నందుకు తెలంగాణ ఉద్యమకారుడిపై దాడి!
  • ముఠాపురంలో చావా రమేష్‌పై పదిమంది యువకులు కర్రలతో దాడి చేశారని ఫిర్యాదు

డీజే సౌండ్ తగ్గించమన్నందుకు తెలంగాణ ఉద్యమకారుడిపై దాడి!

ముఠాపురంలో చావా రమేష్‌పై పదిమంది యువకులు కర్రలతో దాడి చేశారని ఫిర్యాదు

నేలకొండపల్లి, అక్టోబర్ 22 (పీపుల్స్ వాయిస్): డీజే సౌండ్ తగ్గించాలని కోరినందుకు తెలంగాణ ఉద్యమకారుడు చావా రమేష్‌పై కొందరు యువకులు కర్రలతో దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధితుడు నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ముఠాపురానికి చెందిన చావా రమేష్ కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతుండటంతో డీజే సౌండ్ తగ్గించాలని కోరినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన సుమారు పది మంది యువకులు తనపై కర్రలతో దాడికి పాల్పడ్డారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

డీజే శబ్ద కాలుష్యంపై ఆందోళన

నేలకొండపల్లి మండలంలో డీజే శబ్దాల వినియోగంపై వివాదాలు తలెత్తుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చెర్వు మాదారంలో రెండు రోజుల క్రితం డీజే శబ్దాల కారణంగా ఓ మహిళ మృతి చెందినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ ఘటనకు సంబంధించిన కారణాలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, దసరా సందర్భంగా రెండు వర్గాల మధ్య డీజే వినియోగం వివాదానికి దారితీసినట్లు సమాచారం. డీజేలకు అనుమతులు, శబ్ద పరిమితులపై పోలీసు శాఖ నిబంధనలు అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ముఠాపురంలో దుర్గామాత నిమజ్జనం సందర్భంగా డీజేలు వినియోగించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపణలు ఉన్నాయి.

ప్రశ్నిస్తే దాడులా?

డీజే శబ్దాల వల్ల అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శబ్దాన్ని తగ్గించాలని కోరిన వారిపై దాడులకు పాల్పడితే సహించరాదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ముఠాపురం ఘటనపై పోలీసుల అధికారిక స్పందన, దర్యాప్తు వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి :: బురద చల్లితే.. కలం ఆగదు!– సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్

activist attackedTelanganaloweringsound

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

282 Posts

Latest News

సత్తుపల్లి రాజకీయాల్లో నున్నా పుష్పలత పేరు.. తెరపైకి కొత్త సమీకరణాలు! తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యత్వ పుస్తకాల ఆవిష్కరణ చింతకాని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ ఆర్యవైశ్యుల వనసమారాధనను విజయవంతం చేయండి!ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్ పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి_షేక్ బషీరుద్దీన్ బురద చల్లితే.. కలం ఆగదు!– సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్ కోమట్లగూడెం సొసైటీలో 89 అక్రమ సభ్యత్వాలు రద్దు చేయాలి! పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా నూతన సారథులుగా రఘు, లక్ష్మణ్! రాజ్యాంగ హక్కులు ప్రతి సామాన్యుడికీ అందాలి! పల్లె నుంచి జాతీయ స్థాయికి.. కార్మిక ఉద్యమంలో తోట రామాంజనేయులుకు అరుదైన గుర్తింపు!