04/11/2026, Wednesday · 06:38:48 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

చింతకాని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి _ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

Yakub Pasha 28/10/2026 5:19 PM ఖమ్మం

చింతకాని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి _ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత
Want this news as a newspaper clip?Print News Clip
  • పంటల సాగుకు అవసరమైన నీటి కొరత
  • వ్యవసాయ పనులకు అంతరాయం కలిగిస్తున్న విద్యుత్ సమస్యలు
  • వాతావరణ పరిస్థితుల ప్రభావంతో పంటల సాగులో ఇబ్బందులు

చింతకాని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

గ్రామసభలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

చింతకాని, అక్టోబర్ 28 (పీపుల్స్ వాయిస్): చింతకాని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ బసవపురం గ్రామ ప్రజాప్రతినిధులు బుధవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

బసవపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభకు తహసీల్దార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రైతులు సాగునీటి కొరత, విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని గ్రామస్థులకు సూచించారు.

అనంతరం సర్పంచ్ ఆవుల నరసింహారావు, ఉపసర్పంచ్ చంద్రకాని నరసింహారావు, వార్డు సభ్యులు మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని చింతకాని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరారు. రైతులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ గ్రామసభలో పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్, అంగన్‌వాడీ టీచర్, గ్రామ దీపిక, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Submissionto TehsildarUnconcernedZonedeclaredDrought

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్