నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు..పోగొట్టుకున్న పర్సు యజమానికి అప్పగింత! ట్రాఫిక్ సీఐ శివప్రసాద్

- జడ్పీ సెంటర్ వద్ద ఆటో నుంచి కిందపడిన పర్సు
- పర్సులో రూ.9 వేల నగదు, పేటీఎం కార్డు గుర్తింపు
- పేటీఎం కార్డు ఆధారంగా యజమాని చిరునామా గుర్తించిన హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్
- యజమానికి పర్సు, నగదు అందజేసిన ట్రాఫిక్ సీఐ శివప్రసాద్
నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు.. పోగొట్టుకున్న పర్సు యజమానికి అప్పగింత!
ఖమ్మం, నవంబర్ 05 (పీపుల్స్ వాయిస్):
విధి నిర్వహణలో నిజాయితీ, బాధ్యతాయుతంగా వ్యవహరించిన ట్రాఫిక్ పోలీసులు పోగొట్టుకున్న పర్సును గుర్తించి యజమానికి తిరిగి అందజేశారు. స్థానిక జడ్పీ సెంటర్ వద్ద ఆటో నుంచి కిందపడిన పర్సును విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గుర్తించారు.పర్సును పరిశీలించగా అందులో పేటీఎం కార్డుతో పాటు రూ.9 వేల నగదు ఉన్నట్లు గుర్తించారు. యజమానికి సంబంధించిన ఇతర వివరాలు ఏవీ లభించకపోవడంతో పేటీఎం కార్డు ఆధారంగా ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ విచారణ చేపట్టారు. కార్డు వివరాల ఆధారంగా పర్సు యజమాని చిరునామాను గుర్తించి, అతడిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.అనంతరం ట్రాఫిక్ సీఐ శివప్రసాద్ యజమానికి పర్సుతో పాటు అందులోని రూ.9 వేల నగదును తిరిగి అందజేశారు. పోగొట్టుకున్న సొమ్మును భద్రంగా తిరిగి అందించిన ట్రాఫిక్ పోలీసుల నిజాయితీ, చొరవను పలువురు అభినందించారు.
ఇది కూడా చదవండి :: ప్రజా సమస్యల పరిష్కారమే IUML ప్రధాన లక్ష్యం! మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ షకీల్












