04/11/2026, Wednesday · 06:38:33 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

తిమ్మినేనిపాలెంలో ట్రాక్టర్‌ ట్రైలర్‌ బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు

Yakub Pasha 26/10/2026 9:58 PM క్రైమ్

తిమ్మినేనిపాలెంలో ట్రాక్టర్‌ ట్రైలర్‌ బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు
Want this news as a newspaper clip?Print News Clip
  • ప్రమాదంలో 23 మంది మహిళా కూలీలకు గాయాలు
  • ఆరుగురికి తీవ్ర గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదు

తిమ్మినేనిపాలెంలో ట్రాక్టర్‌ ట్రైలర్‌ బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు

చింతకాని, అక్టోబర్ 26 (పీపుల్స్ వాయిస్):

 చింతకాని మండలం తిమ్మినేనిపాలెం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 23 మంది మహిళా వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన కవితతో పాటు మరో 22 మంది మహిళలు నాగులవంచ గ్రామంలో పత్తి ఏరే పనికి వెళ్లారు. పని ముగించుకుని ట్రాక్టర్‌ ట్రైలర్‌లో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 3.50 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను నడుపుతున్న నాగులవంచ గ్రామానికి చెందిన అంబటి శ్రీనివాసరావు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా, అధిక వేగంతో నడపడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయి ట్రాక్టర్‌, ట్రైలర్‌ బోల్తాపడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో ట్రైలర్‌లో ప్రయాణిస్తున్న మహిళా కూలీలు కిందపడిపోగా, కవిత, కొమ్ము నిర్మల, నాదెండ్ల భారతమ్మ, తుడుం మరియమ్మ, నాదెండ్ల రామదేవి, నాదెండ్ల వెంకనమ్మ తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి.

కవిత భర్త మర్రి జ్ఞానేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్‌ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Six InjuredTractorTrailerCollidesinThimminenipalem

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్