04/11/2026, Wednesday · 06:40:57 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

చిన్నమండవలో భూ రీసర్వే.. రైతులు తప్పనిసరిగా పాల్గొనాలి _తహసీల్దార్ కరుణశ్రీ

Yakub Pasha 26/10/2026 6:36 PM ఖమ్మం

చిన్నమండవలో భూ రీసర్వే.. రైతులు తప్పనిసరిగా పాల్గొనాలి _తహసీల్దార్ కరుణశ్రీ
Want this news as a newspaper clip?Print News Clip

చిన్నమండవలో భూ రీసర్వే.. రైతులు తప్పనిసరిగా పాల్గొనాలి _తహసీల్దార్ కరుణశ్రీ

చింతకాని, అక్టోబర్ 26 (పీపుల్స్ వాయిస్):

చింతకాని మండలం చిన్నమండవ గ్రామంలో చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పించేందుకు తహసీల్దార్ కరుణశ్రీ, గ్రామ సర్పంచ్ పర్చ రామచంద్రరావుతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. రీసర్వే విధానం, భూముల సరిహద్దుల పరిశీలన, సర్వే సమయంలో రైతుల భాగస్వామ్యంపై వివరించారు. రైతులు సర్వేలో తప్పనిసరిగా పాల్గొని, ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు రెవెన్యూ సిబ్బందికి సహకరించాలని తహసీల్దార్ కోరారు.

ఈ సందర్భంగా కరుణశ్రీ మాట్లాడుతూ, సర్వేకు ముందు భూముల సరిహద్దులను పరిశీలించి, రీసర్వే వివరాలను రైతులకు ముందుగానే తెలియజేస్తామని తెలిపారు. సర్వే సమయంలో రైతులు హాజరై తమ భూముల వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లకుండా రైతులు, గ్రామస్థులు సహకరించాలని కోరారు. రీసర్వే పూర్తయిన అనంతరం అర్హులైన రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్కులు మంజూరు చేస్తామని తెలిపారు.

అనంతరం చిన్నమండవ, పోలంపల్లి గ్రామాల మధ్య భూముల సరిహద్దులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పర్చ రామచంద్రరావు, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, రెవెన్యూ అధికారి షేక్ లాల్ జాన్ పాషా, రెవెన్యూ సర్వేయర్ నవీన్‌తో పాటు రైతులు మరిదు లక్ష్మీనారాయణ, మోర్ల కృష్ణ, మరిదు రామకృష్ణ, కాశీమాల వేణు, పర్చగాని బ్రహ్మం, గుండ్ల చంటి, గుండ్ల నాగరాజు, గుండ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Tehsildar KarunasriLandSurveyChinnamandavaFarmersParticipate

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్