04/11/2026, Wednesday · 06:41:28 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

రామారావు హత్య కేసులో చిల్లర రాజకీయాలు మానుకోవాలి _ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి

Yakub Pasha 30/10/2026 5:20 PM ఖమ్మం

రామారావు హత్య కేసులో చిల్లర రాజకీయాలు మానుకోవాలి _ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి
Want this news as a newspaper clip?Print News Clip

రామారావు హత్య కేసులో చిల్లర రాజకీయాలు మానుకోవాలి

భట్టి విక్రమార్కపై ఆరోపణలు చేయడం తగదు: మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి

చింతకాని, శుక్రవారం (పీపుల్స్ వాయిస్):

రాజకీయ ప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలు చేయడం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నైజం కాదని, సామినేని రామారావు హత్య కేసును రాజకీయాలకు వాడుకోవడం మానుకోవాలని మత్తేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు అన్నారు. తెల్దారుపల్లికి చెందిన నిందితులే రామారావు హత్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

శుక్రవారం మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడుతూ.. గత ఏడాది పాతర్లపాడు గ్రామంలో సీపీఎం రైతు సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సామినేని రామారావు హత్యకు గురైన విషయం తెలిసిందేనన్నారు. ఈ హత్య కేసులో నిందితులను పట్టుకోవాలని సీపీఎం రాష్ట్ర నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై సీపీఎం నాయకులు పలు కార్యాలయాల ఎదుట ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పోలీసు శాఖ ఉన్నతాధికారులను ఆదేశించి కేసు దర్యాప్తును వేగవంతం చేయించారని అంబటి పేర్కొన్నారు. అప్పటి నుంచి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టడంతో పాటు బెంగళూరులోని ఫోరెన్సిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ సహకారంతో ఆధారాలను పరిశీలించి నిందితులను గుర్తించి అరెస్టు చేశారని తెలిపారు.

అయితే, పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో సీపీఎం నాయకులు భట్టి విక్రమార్కపై హత్యకు సంబంధించిన ఆరోపణలు చేయడం, పోలీసుల విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసుల దర్యాప్తులో అరెస్టయిన నిందితులకు తెల్దారుపల్లికి చెందిన నాయకులతో సంబంధాలు ఉన్నాయని, వారిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని ఆరోపించారు. ఈ అంశాలపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు.

రామారావు నిజాయితీగల, నిస్వార్థ నాయకుడని, ఆయన హత్యకు సంబంధించిన నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడాలని అంబటి అన్నారు. రాజకీయ కక్షలు, ఆరోపణలు పక్కనపెట్టి గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా అందరూ కృషి చేయాలని సూచించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే రాజకీయాలకు స్వస్తి పలకాలని, చట్టం ముందు ఎవరైనా సమానమేనని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మడిపల్లి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొప్పుల గోవిందరావు, కూరపాటి కిషోర్, బందెల నాగార్జున, పెంట్యాల అప్పారావు, సర్పంచులు కిలారి మనోహర్ (చింతకాని), ఆవుల నాగేశ్వరరావు (వందనం), మండల నాయకుడు కాండ్ర పిచ్చయ్య, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంచుమర్తి రామకృష్ణ, తాళ్లూరి బాలాజీ, కొత్తపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని

Chairman AmbatiRetailpoliticsavoidedRamaRaomurdercase

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

145 Posts

Latest News

జగన్ సొంత గడ్డపై టీడీపీ చారిత్రక విజయం.. పులివెందులలో ఎగిరిన పసుపు జెండా! తల్లాడ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఓవర్‌టేక్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం! తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి! : కూనంనేని జర్నలిస్టుల సహనాన్ని పరీక్షించొద్దు.18ఏళ్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపండి!మామిడి సోమయ్య డిమాండ్ కలకత్తాలో టీయూసీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి _ పద్మ శ్రీపాద శ్రీహరి త్యాగం వృథా కానివ్వం..పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ అమరుడు శ్రీపాద శ్రీహరి ఆశయ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలి! పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా ఉంటా.. ఖమ్మం మహిళల కోసం మరిన్ని నిధులు తీసుకొస్తా:రవిచంద్ర ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన! అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్