26/10/2026, Monday · 03:35:36 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు.. 14 మంది మిల్లర్ల అరెస్ట్

Yakub Pasha 26/10/2026 9:04 AM రాష్ట్ర వార్తలు

సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు.. 14 మంది మిల్లర్ల అరెస్ట్
Want this news as a newspaper clip?Print News Clip
  • ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరాలో అక్రమాలు
  • సన్న బియ్యం స్థానంలో దొడ్డు బియ్యం సరఫరా చేసినట్లు ఆరోపణలు
  • నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లో వెలుగుచూసిన మోసం
  • ప్రభుత్వానికి రూ.1.69 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా

సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు.. 14 మంది మిల్లర్ల అరెస్ట్

తెలంగాణ, అక్టోబర్ 26 (పీపుల్స్ వాయిస్)

తెలంగాణలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు సన్న బియ్యం సరఫరాలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై 14 మంది రైస్ మిల్లర్లను సీఐడీ అరెస్ట్ చేసింది. 2025–26 ఖరీఫ్ సీజన్‌లో నిబంధనలకు విరుద్ధంగా సన్న బియ్యానికి బదులుగా దొడ్డు బియ్యం సరఫరా చేసినట్లు వారిపై అభియోగాలు నమోదయ్యాయి.

పౌరసరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ ఈ నెల 24న ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ దర్యాప్తు చేపట్టింది. మిల్లర్లు తమకు కేటాయించిన సన్న రకం ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించి, ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన దొడ్డు బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రయోగశాల పరీక్షల్లోనూ సరఫరా చేసిన బియ్యం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేనట్లు తేలిందని వెల్లడించారు.

నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 రైస్ మిల్లుల నుంచి సుమారు 3,385 టన్నుల దొడ్డు బియ్యం సరఫరా అయినట్లు విచారణలో గుర్తించారు. ఈ వ్యవహారంలో బోనస్ రూపంలో ప్రభుత్వానికి సుమారు రూ.1.69 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. బియ్యం సేకరణను నిలిపివేయడంతో సుమారు రూ.242 కోట్ల మేర నష్టాన్ని నివారించినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసిన సీఐడీ, బియ్యం మళ్లింపు, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఒప్పందాల ఉల్లంఘన, క్రిమినల్ కుట్ర కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందా అనే అంశంపైనా విచారణ జరుపుతోంది.

ఇది కూడా చదవండి :: పత్తి చేలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు

Millers ArrestedIllegalSupplyThinRice

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

90 Posts

Latest News

వందనం గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్పునకు ముందడుగు.. బీటీ రోడ్డు పనులు ప్రారంభం పత్తి చేలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు భారత్‌లోకి ప్రవేశించిన పాక్ జాలర్లు.. నలుగురిని అదుపులోకి తీసుకున్న బీఎస్‌ఎఫ్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఏటీఎం కార్డులా మారారు: కేటీఆర్ లకలూరిపేటలో వైసీపీకి భారీ షాక్... టీడీపీలో చేరిన ఛైర్‌పర్సన్ అభ్యర్థి పురపోరులో కూటమి ఆధిక్యం.. 17 స్థానాలు ఏకగ్రీవం సాగు భూమి పట్టాపై వివాదం.. విచారణకు యువ రైతు విజ్ఞప్తి లింగాల కమలరాజు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వందనం గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులకు పెన్షన్, 250 గజాల స్థలం కల్పించాలని పిడమర్తి రవి డిమాండ్ మహా ధర్నాను జయప్రదం చేయాలి