26/10/2026, Monday · 03:34:48 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఏటీఎం కార్డులా మారారు: కేటీఆర్

Yakub Pasha 26/10/2026 9:33 AM రాష్ట్ర వార్తలు

రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఏటీఎం కార్డులా మారారు: కేటీఆర్
Want this news as a newspaper clip?Print News Clip
  • రాహుల్ గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారిందన్న కేటీఆర్
  • హామీలు గాలికొదిలి కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని విమర్శ
  • సీఎం రేవంత్ పాలనలో స్కామ్‌లు, అవినీతి పెరిగిపోయిందని ఆరోపణ
  • 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్

రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఏటీఎం కార్డులా మారారు: కేటీఆర్

తెలంగాణ, అక్టోబర్ 26 (పీపుల్స్ వాయిస్)

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి ఒక ఏటీఎంగా మారిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏటీఎం కార్డులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వరుస కుంభకోణాలు, అవినీతి జరుగుతున్నా రాహుల్ గాంధీ మౌనంగా ఉండటానికి కారణం.. ఇక్కడి నుంచి ఆయనకు ముడుపులు అందుతుండటమేనని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన మైనారిటీ నాయకుడు జిబ్రాన్ షరీఫ్, తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.

రాహుల్ మౌనం వెనుక మర్మమదే 

దేశమంతా తిరుగుతూ ‘ఛాత్రోంకీ గూంజ్’ అంటూ ఉపన్యాసాలిచ్చే రాహుల్ గాంధీకి తెలంగాణలో అడుగుపెట్టే ధైర్యం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు 420 హామీలిచ్చి, వెయ్యి రోజులు గడుస్తున్నా వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. "రాహుల్ గాంధీ అడ్రస్ లేకుండా పోయారు. తెలంగాణలో ఏం జరుగుతుందో ఆయనకు పట్టడం లేదు. ఎందుకంటే ఆయనకు అందాల్సినవి అందుతున్నాయి. అందుకే ఇక్కడి స్కామ్‌లపై, ప్రభుత్వ వైఫల్యాలపై నోరు మెదపడం లేదు" అని కేటీఆర్ ఆరోపించారు.

ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో టీ స్టాల్ వద్ద కూర్చొని నిరుద్యోగ యువతకు ఉద్యోగాల గురించి భరోసా ఇచ్చిన రాహుల్ గాంధీ, ఇప్పుడు వారిని పూర్తిగా విస్మరించారని అన్నారు. మైనారిటీల కోసం ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించి, సంక్షేమానికి రూ.4,000 కోట్లు కేటాయిస్తామన్న హామీని గాలికొదిలేశారని విమర్శించారు. ఆసరా పెన్షన్‌ను రూ.4,000కు పెంచుతామని, రైతులకు ఎకరానికి రూ.15,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్లతో, అక్రమ కేసులతో బెదిరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో వరుస కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయని, ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన భూ వ్యవహారాలు అనుమానాస్పదంగా ఉన్నాయని అన్నారు. "సుమారు రూ.200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని కేవలం రూ.7 కోట్లకే తన తమ్ముడికి కట్టబెట్టారు. అమెరికాలో ఉంటున్న మరో సోదరుడికి సంబంధించిన రూ.1,000 కోట్ల డీల్‌పై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
2028లో కేసీఆరే మళ్లీ సీఎం

ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య మతపరమైన విభజనలు సృష్టిస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని కేటీఆర్ అన్నారు. దేశంలో ప్రధాని మోదీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏకైక శక్తి బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు. "ఇంకో ఏడాదిన్నరలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణను తిరిగి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం" అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి :: పత్తి చేలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు

Gandhi KTRRevanthReddybecomeATMcardRahul

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

90 Posts

Latest News

వందనం గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్పునకు ముందడుగు.. బీటీ రోడ్డు పనులు ప్రారంభం పత్తి చేలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు భారత్‌లోకి ప్రవేశించిన పాక్ జాలర్లు.. నలుగురిని అదుపులోకి తీసుకున్న బీఎస్‌ఎఫ్ సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు.. 14 మంది మిల్లర్ల అరెస్ట్ లకలూరిపేటలో వైసీపీకి భారీ షాక్... టీడీపీలో చేరిన ఛైర్‌పర్సన్ అభ్యర్థి పురపోరులో కూటమి ఆధిక్యం.. 17 స్థానాలు ఏకగ్రీవం సాగు భూమి పట్టాపై వివాదం.. విచారణకు యువ రైతు విజ్ఞప్తి లింగాల కమలరాజు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వందనం గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులకు పెన్షన్, 250 గజాల స్థలం కల్పించాలని పిడమర్తి రవి డిమాండ్ మహా ధర్నాను జయప్రదం చేయాలి