05/11/2026, Thursday · 11:30:13 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు కొట్టాడనే ఆరోపణ.. పదో తరగతి విద్యార్థి మృతి

Yakub Pasha 05/11/2026 8:40 AM క్రైమ్

హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు కొట్టాడనే ఆరోపణ.. పదో తరగతి విద్యార్థి మృతి
Want this news as a newspaper clip?Print News Clip

హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు కొట్టాడనే ఆరోపణ.. పదో తరగతి విద్యార్థి మృతి

తండ్రికి ఫోన్ చేసి హాస్టల్లో ఉండలేకపోతున్నానని ఆవేదన.. వర్గల్ బీసీ వసతి గృహంలో విషాదం

సిద్దిపేట, నవంబర్ 05 (పీపుల్స్ వాయిస్):

సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. హోంవర్క్ చేయలేదనే కారణంతో ఉపాధ్యాయుడు కొట్టాడని ఆరోపిస్తూ, మనస్తాపానికి గురైన పదో తరగతి విద్యార్థి రామ్ చరణ్ (15) మృతి చెందాడు.మార్కుక్ మండలం పోతూర్ గ్రామానికి చెందిన రామ్ చరణ్ వర్గల్ మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో ఉపాధ్యాయుడు కొట్టాడని, హాస్టల్లో ఉండలేకపోతున్నానని బాలుడు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో వసతి గృహంలో ఎవరూ లేని సమయంలో బాలుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఘటనను గుర్తించిన సిబ్బంది బాలుడిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు సమాచారం.

చిన్న వయసులోనే బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి :: అమరవీరుల సభను జయప్రదం చేయాలి.. ఇండస్ట్రియల్ ఏరియాలో మాస్ లైన్ విస్తృత ప్రచారం!

teacher beatenAllegeddeathdoinghomeworkClassstudentdies

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

158 Posts

Latest News

అమరవీరుల సభను జయప్రదం చేయాలి.. ఇండస్ట్రియల్ ఏరియాలో మాస్ లైన్ విస్తృత ప్రచారం! రేకుల ఇళ్లలో రెక్కల కష్టం.. పాములు, తేళ్ల మధ్య పేదల బతుకులు! ఇందిరమ్మ ఇళ్ల కోసం సర్పంచ్ వినతి ఎంపీ వద్దిరాజును సన్మానించి జ్ఞాపిక అందజేసిన జల్లెల శ్రీనివాసరావు దీపావళి బాణసంచా దుకాణాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి!ఎస్సై జి. నరేష్ హెచ్చరిక జలకళ సంతరించుకున్న లంకాసాగర్.. గంగమ్మకు ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక పూజలు! మురసు తుఫాన్‌తో నీట మునిగిన వరి పొలాలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి! న్యాయమూర్తి జయరాజు మాతృమూర్తి రోజానమ్మకు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి బీసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లాస్యశ్రీ వైద్యానికి ఎంపీ వద్దిరాజు రూ.2 లక్షల ఎల్‌వోసీ అందజేత! అవినీతి అధికారిపై సస్పెన్షన్ వేటు.. ముదిరాజ్ సమాజంలో హర్షాతిరేకాలు!