సాగు భూమి పట్టాపై వివాదం.. విచారణకు యువ రైతు విజ్ఞప్తి

సాగు భూమి పట్టాపై వివాదం.. విచారణకు యువ రైతు విజ్ఞప్తి
హైదరుసాయిపేటలో భూమి రికార్డులను పరిశీలించి సమస్య పరిష్కరించాలని హరికిషన్ కోరారు
తిరుమలాయపాలెం, అక్టోబర్ 25 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం హైదరుసాయిపేట గ్రామంలో సాగు భూమి పట్టా విషయంలో వివాదం నెలకొంది. తాను సాగు చేస్తున్న భూమి పట్టా వేరొకరి పేరుపై ఉందని యువ రైతు గుగులోతు హరికిషన్ తెలిపారు.
సదరు భూమిలో కొంతకాలంగా పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని పేర్కొన్న ఆయన, పట్టా విషయంలో ఎదురవుతున్న సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు. భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, రెవెన్యూ రికార్డుల ఆధారంగా విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి :: మహా ధర్నాను జయప్రదం చేయాలి












