07/11/2026, Saturday · 11:07:22 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

కరువు కోరల్లో కామేపల్లి రైతాంగం.. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి! ఎన్.వి. రాకేష్

Yakub Pasha 07/11/2026 8:02 AM ఖమ్మం

కరువు కోరల్లో కామేపల్లి రైతాంగం.. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి! ఎన్.వి. రాకేష్
Want this news as a newspaper clip?Print News Clip
  • కామేపల్లి మండలంలో తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి
  • పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పరిహారం చెల్లించాలి

కరువు కోరల్లో కామేపల్లి రైతాంగం.. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి!

అమరవీరుల సంస్మరణ సభలో ఎన్.వి. రాకేష్ డిమాండ్

కామేపల్లి, నవంబర్ 06 (పీపుల్స్ వాయిస్):

రైతాంగం తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కామేపల్లి మండలంలో ప్రభుత్వం తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ కామేపల్లి, కారేపల్లి సంయుక్త మండలాల సహాయ కార్యదర్శి ఎన్.వి. రాకేష్ డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని కోరారు.

సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గరిడేపల్లి గ్రామంలో నిర్వహించిన విప్లవ అమరవీరుల సంస్మరణ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా విముక్తి కోసం, దోపిడీ, పీడన, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నాయకులు, కార్యకర్తలు విప్లవాంజలి ఘటించారు.ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ.. అమరవీరులు ఆశించిన సమసమాజ స్థాపన కోసం ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేడు రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వర్షాభావంతో ఖరీఫ్ పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని, సాగు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పంట నష్టపోయిన రైతులకు ఆహార పంటలకు ఎకరానికి రూ.50 వేలు, వాణిజ్య, కూరగాయ పంటలకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్షాభావం కారణంగా సాగుకు నోచుకోని భూములకు ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకు పంపిణీ చేయాలని, ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయడంతో పాటు పశుగ్రాసం, తాగునీటి కొరత నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పంట నష్టాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి, అర్హులైన రైతులందరికీ నష్టపరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని రైతాంగం, కార్మికులు, పేద ప్రజల హక్కుల సాధనకు నిరంతరం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాస్ లైన్ నాయకులు శ్రీరామోజీ వెంకటాచారి, శ్రీరామోజీ రంగాచారి, రత్తమ్మ, దామా పిచ్చా తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు!

Kamepalli farmerdroughtqueuescompensatedimmediatelyRakesh

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

179 Posts

Latest News

ప్రమాదంలో గాయపడిన ఎన్‌టీవీ కెమెరామెన్ భార్యకు టీజేఎఫ్ ఆర్థిక సాయం అష్రఫ్, మహ్మద్ రఫీలకు ఎంపీ వద్దిరాజు ఆశీస్సులు ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసిందేమిటో చెప్పాలి! వద్దిరాజు రవిచంద్ర పందిళ్ళపల్లిలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు! వ్యభిచార గృహంపై ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ మెరుపు దాడి.. ముగ్గురు మహిళలకు విముక్తి! పేద విద్యార్థిని చదువుకు "గోపా" అండ.. రూ.64 వేల ఆర్థిక సాయం! బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు పట్టివేత! పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు! పకీర్ సాహెబ్ పోరాట ఫలితం.. దూదేకుల భవనానికి రూ.3 కోట్లు! ఆపదలో ప్రజల మధ్యకు.. బాధ్యతలో ముందంజ.. కలెక్టర్‌కు జర్నలిస్టుల ఘన సత్కారం!