07/11/2026, Saturday · 11:07:20 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

పందిళ్ళపల్లిలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు!

Yakub Pasha 07/11/2026 6:17 PM ఖమ్మం

పందిళ్ళపల్లిలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు!
Want this news as a newspaper clip?Print News Clip

పందిళ్ళపల్లిలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు!

రూ.20.04 లక్షలతో ఎక్స్‌టెన్షన్ విద్యుత్ స్తంభాల పనులు ప్రారంభం

చింతకాని, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా మంజూరు చేసిన రూ.20.04 లక్షల నిధులతో ఈ పనులను చేపట్టారు.గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల సమీపంతో పాటు దూరప్రాంతాల్లో ఉన్న నివాసాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు లో-వోల్టేజీ సమస్యలను అధిగమించే లక్ష్యంతో ఎక్స్‌టెన్షన్ పోల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల ప్రారంభంతో గ్రామంలో విద్యుత్ సరఫరా సమస్యలు తగ్గనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వత్సవాయి పద్మ, వత్సవాయి జానకిరాములు, ఉప సర్పంచ్ మేకల కల్పన, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగ సూరా రెడ్డి, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనం ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే ఎన్పీడీసీఎల్ బోనకల్ ఏడీఈ, నాగులవంచ ఏఈ, సంబంధిత కాంట్రాక్టర్, విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి :: పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు!

Permanent SolutionStepstowardsPowerProblemsPannillapalli

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

179 Posts

Latest News

ప్రమాదంలో గాయపడిన ఎన్‌టీవీ కెమెరామెన్ భార్యకు టీజేఎఫ్ ఆర్థిక సాయం అష్రఫ్, మహ్మద్ రఫీలకు ఎంపీ వద్దిరాజు ఆశీస్సులు ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసిందేమిటో చెప్పాలి! వద్దిరాజు రవిచంద్ర వ్యభిచార గృహంపై ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ మెరుపు దాడి.. ముగ్గురు మహిళలకు విముక్తి! పేద విద్యార్థిని చదువుకు "గోపా" అండ.. రూ.64 వేల ఆర్థిక సాయం! బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు పట్టివేత! పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు! కరువు కోరల్లో కామేపల్లి రైతాంగం.. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి! ఎన్.వి. రాకేష్ పకీర్ సాహెబ్ పోరాట ఫలితం.. దూదేకుల భవనానికి రూ.3 కోట్లు! ఆపదలో ప్రజల మధ్యకు.. బాధ్యతలో ముందంజ.. కలెక్టర్‌కు జర్నలిస్టుల ఘన సత్కారం!